కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 11వ వార్డు డివిజన్ వాలంటీర్‌గా పని చేస్తున్న మద్దెల కృష్ణపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్లోని ఓ మద్యం దుకాణంలో మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి
'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'