బిగ్‌బాస్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటలప్పుడు వెళ్లారు. కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్ వారిని నిలదీయగా మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఒక దశలో యువకులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'బ్రహ్మాజీ కొడుకని హీరోయిజం చూపించాడు'