ATM Services at Kodi Pandalu in Krishna District: సంక్రాంతి సంబరాల్లో పందేంరాయుళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొన్ని బ్యాంకులు ఏర్పాట్లు చేశాయి. కోడిపందేల్లో పాల్గొనేవారు డబ్బు కోసం దూరంలో ఉన్న ఏటీఎం సెంటర్కు వెళ్లకుండా.. బరులు ఉన్న ప్రాంతాల్లోనే మొబైల్ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. తామున్న చోటుకే ఏటీఎం తరలిరావడంతో పందెంరాయుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో పూడి గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందేల్లో కేడీసీసీ బ్యాంక్ వారు ఏటీఎం సేవలు ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం నుంచి నగదు తీసుకొని జూదరలు కోడి పందేలు ఆడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోడి పందేలు చూడటానికి వచ్చిన జనం కేడీసీసీ వారి ఏటీఎంను చూసి.. కోడి పందేలకు ఇలాంటి సేవలు కూడా అందిస్తారా అని ఆశ్చర్యపోయారు.
మరోవైపు చాట్రాయి మండలం జనార్దనవరంలో ఫోన్ పేలో వెయ్యి రూపాయలకు ముప్పై రూపాయలు కమీషన్ తీసుకొని డబ్బులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఉంటే డబ్బులు ఇస్తామని.. బ్యానర్ కట్టి మరీ ప్రచారం చేశారు.
ఇదీ చదవండి...