కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిధిలో ఉండే ఓ యువతికి... గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన గుర్రం ఉదయ్కమల్భాస్కర్ అనే ఆర్ఎంపీ వైద్యునితో నిశ్చితార్థం జరిగింది. అతని ప్రవర్తన మంచిది కాదని తెలుసుకున్న పెద్దలు నిశ్చితార్థం రద్దు చేశారు. దీనిపై కక్ష పెంచుకున్న సదరు ఆర్ఎంపీ వైద్యుడు గతంలో ఆమె తనతో సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను.. యువతి పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరిచి పోస్టు చేశాడు. దీనిపై బాధిత యువతి ఈనెల 18న పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేసిన అవనిగడ్డ పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని.. సెక్షన్ 354ఎ, సి కింద కేసు నమోదు చేశారు. నిందితుడు కోడూరు మండలం పిట్టల్లంక గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మహిళలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి: