కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో ఈనెల 21న సీఎం జగన్ ప్రారంభించనున్న "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష" పథకం ఏర్పాట్లను.. మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. తక్కెళ్లపాడు గ్రామ సచివాలయ కార్యాలయంలో.. వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా.. జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో సభా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: