ETV Bharat / state

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి'

author img

By

Published : Feb 20, 2021, 5:20 PM IST

రేపు జరగనున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్‌ కోరారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.

fourth phase panchayat elections in krishna district
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి

ఆదివారం జరిగే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో జరిగే పోలింగ్‌కు అంతా సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌ తెలిపారు. నూజివీడు డివిజన్‌లో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. డివిజన్​లోని 14 మండలాల పరిధిలోని 275 పంచాయతీల్లో సర్పంచి, 2483 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉయ్యూరు మండలంతో పాటు పమిడిముక్కలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా నూజివీడు వచ్చిన ఎస్పీ పోలీసు బందోబస్తును పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా, అక్రమంగా నగదు, ఇతర వస్తువుల రవాణాను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

  • పోలీస్ కంట్రోల్ రూం: 8332983792
  • పోలీస్ హెల్ప్ లైన్: 9491068906
  • పోలీస్ వాట్సప్: 9182990135

గన్నవరం సర్కిల్ పరిధిలోని ఎన్నికల భద్రతా ఏర్పాట్లను... విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. ఏర్పాట్లపై తూర్పు ఏసీపీ విజయ్ పాల్, సీఐ శివాజీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.