కొవిడ్ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని వెంటనే డిశ్చార్జి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్నా కొన్నిచోట్ల డిశ్చార్జి చేయడం లేదని ఫిర్యాదులపై స్పందించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు.. పలు కొవిడ్ నెట్‌వర్క్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చింది. చికిత్స పేరుతో ఆరోగ్యశ్రీ నుంచి డబ్బు వసూలుకు యత్నిస్తున్నారని.. కొన్ని ఆస్పత్రులు చికిత్స పేరుతో 2 వారాలపాటు ఉంచుతున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు వచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టింది. కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల తీరుతో పడకలకు కొరత ఏర్పడుతుందని పేర్కొంది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రోజువారీ చెల్లింపులు చేయాలని గతంలో టెక్నికల్ కమిటీ నిర్ణయించింది.
ఇవీ చూడండి..
విశాఖలో తెదేపా కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి.. చంద్రబాబు, లోకేష్ సంతాపం