ETV Bharat / state

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు.. తీరేనా ఆక్వా రైతుల కష్టాలు? - water problems

ఆక్వా సాగు... రాష్ట్ర తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలిపింది. లక్షల ఎకరాలకు విస్తరించిన ఈ సామ్రాజ్యం ఎంతో మందికి ఆదాయవనరుగా మారింది. ఒకప్పుడు చేపలు, రొయ్యల ఎగుమతులతో ఆదాయాన్ని ఆర్జించిన ఆక్వా రైతులు... ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటోంది. నూతన ప్రభుత్వం తమకు చేయూతనిస్తుందని వారు ఆశిస్తున్నారు.

నీరు లేక నష్టాలు
author img

By

Published : Jun 12, 2019, 7:32 AM IST

నీరు లేక నష్టాలు

ఆంధ్రప్రదేశ్​కు ఆదాయాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగానిది మొదటి స్థానం. నీలి విప్లవంతో రాష్ట్రంలో పురుడుపోసుకున్న ఈ రంగం... నాలుగు దశాబ్దాలుగా అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ కృష్ణా జిల్లాను రాష్ట్ర తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ రంగాన్ని గ్రోత్ఇంజన్​గా గుర్తించి మౌలిక వసతులు కల్పిస్తోంది. జిల్లా రైతులు వ్యవసాయం నుంచి ఆక్వాకు మళ్లిన తొలినాళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అనుభవం నేర్పిన పాఠాలతో.. గత ప్రభుత్వాలు కల్పించిన కొన్ని మౌలిక సదుపాయాలతో ఈ రంగం అభివృద్ధి బాటలో పరుగులు తీసింది.

నీరు లేక నష్టాలు
అయితే 2002 నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. కృష్ణానది నుంచి కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందడం లేదని... తాగు నీరు వదులుతున్న సమయంలో చేపలు రొయ్యల చెరువులకు నీటిని పట్టుకోనివ్వడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. దీనివల్ల చాలా నష్టాలు ఎదుర్కొంటున్నామని... నూతన ప్రభుత్వమైనా తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశంతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు చెబుతున్నారు.

జిల్లాలో ఆక్వారంగం వలన భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. జిల్లాలోని 60 శాతం ప్రజలు ప్రత్యక్షంగా... పరోక్షంగా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం సాగు నీటి ఇబ్బందులతో అల్లాడుతున్న ఆక్వా రంగానికి జగన్ ప్రభుత్వం సాయమందిస్తే ఎంతోమందికి మేలు చేకూరుతుందని ఆక్వా రైతులు అంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.