రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇన్ఛార్జ్లు, సమన్వయకర్తలను నియమించారు. అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలోనూ ఈ నియామకాలు చేపట్టారు. 13 జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించారు.
- ఉత్తరాంధ్ర బాధ్యతలను జీవీఎల్ నరసింహరావు, కె.హరిబాబు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, కాశీవిశ్వనాథ రాజులకు అప్పగించారు.
- ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణలను నియమించారు.
- గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌బాబుకు అప్పగించారు.
- నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించి సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలకు బాధ్యతలు ఇచ్చారు.
- అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్, పార్థసారథి, వరదాపురం సూరిలను నియమించారు.
ఇదీ చూడండి. సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం