వైకాపా ప్రభుత్వం త్వరలో జుట్టు పన్ను వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ధరలు పెంచడం ద్వారా తిరిగి తీసుకుంటుందని ఆరోపించారు. కర్రీ పాయింట్ల మీద కూడా ఏడాదికి రూ.2,500 రూపాయలు వృత్తి పన్ను విధించడం శోచనీయమన్నారు. 15 నెలల కాలంలో వివిధ రంగాలలో ఛార్జీలు పెంచి ప్రజలను ఆర్థికంగా దోచుకుందని మండి పడ్డారు. మద్యం, సిమెంట్, ఇసుక, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి వెన్ను విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్ చేసిన కామాటి సస్పెన్షన్