ETV Bharat / state

'సరిహద్దుల్లో మళ్లీ అంబులెన్సులను ఆపడం సిగ్గుచేటు' - BJP leader Vishnu Vardhan Reddy on Telangana Police latest news

తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అంబులెన్సులను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇంతకంటే ఘోరం, సిగ్గుచేటు మరొకటి లేదని మండిపడ్డారు. సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు విని, వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

vishnu
vishnu
author img

By

Published : May 14, 2021, 12:43 PM IST

తెలంగాణ సరిహద్దులో నిన్న రాత్రి నుంచి అంబులెన్సులను ఆ రాష్ట్ర పోలీసులు అనుమతించడంలేదని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై ఆధారాలతో సహా పంపుతున్నానని, సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు విని, వారి సమస్యలను పరిష్కరించి వారి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తిచేశారు. కర్నూలు సరిహద్దులో ఆంధ్రా పోలీసులు, ఇతర అధికారులు రోగుల ఆక్రందనలపై చేతులెత్తేశారని అన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు ప్రకటనలు నోటిమాటకే పరిమితం అయ్యాయన్నారు.

సాధారణ ప్రయాణికులను 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతించిన తెలంగాణ పోలీసులు అంబులెన్స్​లను మాత్రం వెనక్కి పంపుతున్నారన్నారు. ఇంతకంటే ఘోరం, సిగ్గుచేటు మరొకటి లేదని విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సాధారణ ప్రజలు తెలంగాణలోని పోలీసు కంట్రోల్ రూమ్​లో అనుమతులును తీసుకోవడం.. అంబులెన్సు ఉన్న రోగికి, వారి బంధువులకు సాధ్యమా అని ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు రోగులకు ఇచ్చిన ఈ పాస్ ను సైతం తెలంగాణ పోలీసులు లెక్కచేయడంలేదన్నారు. గద్వాల పుట్లూరు టోల్ ప్లాజా వద్ద తెలంగాణ పోలీసులు 20 అంబులెన్స్ లను అడ్డుకోవడంతో ఓ రోగి మృతిచెందాడని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.