ETV Bharat / state

బాబు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం -బుద్దా - మోహన్ బాబు

ముఖ్యమంత్రిని తిడితే పెద్దవారవుతారని మోహన్ బాబు అనుకుంటున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబు ముఖ్యమంత్రి కావాలని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు.

మోహన్ బాబుపై...బుద్దా వెంకన్న ఫైర్
author img

By

Published : Mar 31, 2019, 2:49 PM IST

మోహన్ బాబుపై...బుద్దా వెంకన్న ఫైర్
ముఖ్యమంత్రిని తిడితే పెద్దవారవుతారని మోహన్​బాబు అనుకుంటున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. మోహన్ బాబు ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం పిల్లలతో కలిసి రోడ్డెక్కి దాని గురించి మాట్లాడకుండా... పసుపు కుంకుమ గురించి మాట్లాడటం సంబంధం లేకుండా ఉందని అన్నారు. ఏదో ఒక పార్టీ అండ కావాలని వైకాపాలో చేరారని,... మాట్లాడితే అన్నగారు అంటారు కానీ ఆయనతో ఉన్న స్నేహం, బంధుత్వం గురించి వివరించాలని డిమాండ్ చేశారు.

అన్న గారి పేరు చెప్పుకుంటూ ఆయన పార్టీ వారసుడైన చంద్రబాబును విమర్శించడం ఏంటని, లక్ష్మీ ప్రసన్న బ్యానర్​లో మీ పిల్లలతో తప్ప వేరే హీరోలతో ఎప్పుడైనా సినిమాలు తీశారా అని ప్రశ్నించారు. వయస్సు మీద పడ్డాక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబుని విమర్శించే స్ధాయి మోహన్ బాబుది కాదని మండిపడ్డారు. అవకాశవాదిలా మోహన్ బాబు మాట్లాడుతున్నారని... చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే ఘాటుగా స్పందించాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

Intro:Ap_Vsp_91_31_Kottapalli_Geeta_Pracharam_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) జన జాగృతి పార్టీ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రచారం నిర్వహించారు.

Body:దక్షిణ నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తుండడంతో నియోజకవర్గంలోని రెల్లి వీధి, పూర్ణ మార్కెట్, ఏవీఎన్ కళాశాల, కేజీహెచ్ వెనక పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న వారందరినీ కలిసి తనకు ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు.

Conclusion:తనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. తోట నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడం అలాగే డ్రైనేజీ సమస్య, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తానని ఆమె తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.