ETV Bharat / state

ఆటో, టాక్సీ డ్రైవర్ల ప్రోత్సాహక పథకానికి.. 14 నుంచి దరఖాస్తులు - auto and car drivers

ఆటో, కార్ డ్రైవర్ లకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకంపై అర్హులు పూర్తి వివరాలు తెలుసుకుని ఉండాలని నూజివీడు రవాణా శాఖ అధికారి రవి కుమార్ అవగాహన కల్పించారు.

'ఆటోవాలా ప్రోత్సాహక నగదు బహుమతి కై ఆన్​లైన్లో దరఖాస్తు'
author img

By

Published : Sep 13, 2019, 7:17 PM IST

'ఆటోవాలా ప్రోత్సాహక నగదు బహుమతి కై ఆన్​లైన్లో దరఖాస్తు'

ఆటో, కార్ డ్రైవర్ లకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న 10 వేల రూపాయల ఆర్థిక సహాయ పథకంపై.. పోలీసులు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రవి కుమార్ నూజివీడు పట్టణంలో పలువురు ఆటో, కార్ డ్రైవర్ లకు ఈ పథకంపై పూర్తి వివరాలు చెప్పారు. సొంత వాహనం కలిగి ఉండి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారికి పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ నెల​ 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు. సమాచారం కోసం గ్రామ వాలంటీర్లను, వీఆర్వో లను సంప్రదించవచ్చన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్​ వద్ద పథకంపై అవగాహన కల్పించడమే కాక... ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.