ETV Bharat / state

హద్దులు మీరుతున్న పోలీసు అరాచకాలు

ప్రభుత్వ వైఫల్యాల్ని, లోపాల్ని ఎత్తి చూపేవారిని, వైకాపాపై విమర్శలు చేసినవారిని పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు, తనిఖీలు, సోదాలు, అరెస్టుల పేరిట భయభ్రాంతులకు గురిచేయటం, నోటీసులు ఇవ్వటానికి వచ్చామంటూ రాత్రివేళ వెళ్లడం, తలుపులు విరగ్గొట్టి మరీ ఇళ్లలోకి చొరబడటం, కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టడం సర్వసాధారణమైపోయాయి.

POLICE
POLICE
author img

By

Published : Aug 28, 2022, 7:40 AM IST

రాష్ట్రంలో కొందరు పోలీసుల అరాచకం హద్దులు దాటుతోంది. ప్రతిపక్ష నేతలపైనే కాదు.. వైకాపా నాయకులకు గిట్టని, ప్రత్యర్థులకు మద్దతిచ్చే, ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపే, పాలనా వైఫల్యాల్ని ప్రశ్నించే, సామాజిక మాధ్యమాల్లో గళమెత్తే వారిపైనా పోలీసులు తీవ్ర అణచివేత ప్రదర్శిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. వైకాపా నాయకులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకుల అరాచకాలపై కన్నెత్తి చూడని రక్షకభటులు.. అధికార పార్టీ చర్యల్ని తప్పుపట్టే ప్రతిపక్షనాయకులు, ప్రజా సంఘాలు, సామాన్యులపై మాత్రం లాఠీ ఝుళిపిస్తున్నారు. వైకాపా నాయకుల చేతిలో దాడులకు గురైన ప్రతిపక్ష నాయకులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు. వారిచ్చే ఫిర్యాదుల్ని బుట్టదాఖలు చేస్తున్నారు.

సవాంగ్‌ను మించి అన్నట్లుగా.. రాజేంద్రనాథరెడ్డి హయాం

గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు బాస్‌గా ఉన్నప్పటి కంటే.. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి హయాంలో పోలీసుల అణచివేత, నిర్బంధాలు, అరాచకం మరింత పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, కేసుల ఛేదన, అరాచక శక్తుల అణచివేత వంటివి వదిలేసి.. కేవలం వైకాపా నాయకుల రాజకీయ కక్షసాధింపు చర్యల్ని అమలు చేయడం, వారి ప్రయోజనాలు కాపాడటమే పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అధికార పార్టీకి మాత్రమే తాను డీజీపీ అన్నట్లుగా రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది. ఏదైనా అంశంపై ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఫిర్యాదు లేదా వినతిపత్రం ఇవ్వటానికి వెళితే డీజీపీ కలవనే కలవరు. కార్యాలయం గేటు బయటే పోలీసులు వారిని అడ్డుకుంటారు. ఇదేమిటని అడిగితే బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో పోలీసుల దారుణాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నా.. డీజీపీ ఏ మాత్రమూ స్పందించరన్న విమర్శలున్నాయి.

ఘర్షణలకూ కారణమవుతూ..

ఘర్షణలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే.. రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలు, అలజడులకు కారణమవుతుండటం గమనార్హం. ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా నిరసన తెలిపేందుకు వెళ్తే భారీ ఎత్తున బలగాల్ని మోహరించి ముందే అడ్డుకుంటున్నారు. అక్రమంగా నిర్బంధిస్తున్నారు. వైకాపా నాయకుల రెచ్చగొట్టే కార్యక్రమాలకు మాత్రం భద్రత కల్పించి మరీ సహకరిస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెదేపా ఫ్లెక్సీలు, బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చించేసి ఘర్షణలకు కారణమైనా, పోలీసుస్టేషన్‌ పక్కనే ఉన్న అన్న క్యాంటీన్‌పై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. దీనిపై ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలపై మాత్రం లాఠీఛార్జి చేశారు.

ఇదా పోలీసింగ్‌?

చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసుల్లో కొందరి వ్యవహారశైలి, వాడుతున్న భాష రౌడీయిజాన్ని తలపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రాపకం, కీలకమైన పోస్టింగులు దక్కించుకోవటం కోసం కొందరు అధికారులు ప్రతిపక్ష శ్రేణులపై రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా యాడికిలో తెదేపాకు చెందిన ఆరుగుర్ని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారి కాళ్లు, చేతులు వాచిపోయి, రక్తం కారేలా విచక్షణారహితంగా కొట్టారు. వైకాపా నాయకుల తప్పుడు ఫిర్యాదు ఆధారంగా డీఎస్పీ చైతన్య తమను కొట్టారని బాధితులు ఆరోపించారు.

వైకాపాపై కేసులు ఉండవు.. ప్రతిపక్షాలపై వద్దన్నా కేసులే

* వైకాపా నాయకుల దౌర్జన్యాలు, దాడులు, అకృత్యాలు, అరాచకాలు, దాష్టీకాలు, సామాజిక మాధ్యమాల్లో వారు చేసే వికృత దాడిపై ఎన్ని ఫిర్యాదులిచ్చినా పోలీసులు కేసు నమోదు చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టినా తర్వాత చర్యలు తీసుకోవట్లేదు.

* తెలుగుదేశం సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాల్ని ప్రశ్నించేవారిని, సామాజిక మాధ్యమాల్లో గళమెత్తేవారిపై వైకాపా వారితో ఫిర్యాదులు ఇప్పించుకుని మరీ కేసులు పెడుతున్నారు. అరెస్టు చేసి, థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.

చట్టం వైకాపా చుట్టం

* ‘ఏయ్‌ తమాషా చేస్తున్నావా? చొక్కా పట్టి లాగేస్తాన్రా!’ అంటూ కొన్నాళ్ల కిందట విశాఖపట్నంలోని శారదా పీఠం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ సీఐపై మంత్రి సీదిరి అప్పలరాజు దౌర్జన్యం చేశారు. ఇప్పటి వరకూ ఆయనపై కేసే లేదు.

* వీధిదీపాలు వేస్తున్న విద్యుత్తు సిబ్బందిని అడ్డుకున్నారంటూ ఆ శాఖాధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై నెల్లూరు రెండో పట్టణ పోలీసులు కొంతమంది వైకాపా కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో ఉంచారు. నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ అక్కడికొచ్చి వీరంగం వేశారు. దర్జాగా తమవారిని తీసుకెళ్లిపోతుంటే ఎస్సై సహా పోలీసులు అడ్డుకోలేదు.

* వైకాపా నుంచి తెదేపాలో చేరేందుకు వెళ్తున్న చెన్నేకొత్తపల్లి ఉపసర్పంచి రాజారెడ్డిని రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి మార్గమధ్యలో అడ్డుకుని బలవంతంగా తీసుకెళ్లారు. తనను తెదేపా నాయకులు కిడ్నాప్‌ చేశారంటూ అతనితోనే ఓ వీడియో విడుదల చేయించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కిమ్మనలేదు.

నోటికొచ్చినట్లు తిట్టినా చర్యలే ఉండవు..

వైకాపా కార్యకర్తలు తనను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పోలీసులకు ఫిర్యాదు చేసి రెండేళ్లు పూర్తవుతున్నా కేసు నమోదు చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నాయకుల కుటుంబసభ్యుల్ని, మహిళా నాయకుల్ని అసభ్యంగా దూషిస్తూ వీడియోలు, పోస్టులు పెడుతున్న వైకాపా కార్యకర్తలపై ఎన్ని ఫిర్యాదులు అందినా కేసులే లేవు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు.. ప్రతిపక్షనేతలను దుర్భాషలాడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు.

విచారణ పేరిట థర్డ్‌ డిగ్రీ

* ప్రభుత్వ విధానాల్లోని లోపాలపై విమర్శనాత్మక వీడియోలు పెట్టిన ‘ఘర్షణ’ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు వెంగళరావును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు అతన్ని చిత్రహింసలు పెట్టారు. తాము కొట్టామని న్యాయమూర్తితో చెబితే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించారు.

* ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపినందుకు ఏకంగా వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపైనే కేసు పెట్టారు. అదుపులోకి తీసుకుని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. కాళ్లు వాచిపోయేలా కొట్టడం అరాచకానికి పరాకాష్ఠ.

* ‘సీఐడీ పోలీసులు నన్ను మోకాళ్లపై కూర్చోబెట్టి కర్రలతో కొట్టారు. ఓ పోలీసు అధికారి నా గుండెలపై బాదారు. విచారణ పేరుతో దుస్తులు విప్పించి చిత్రహింసలు పెట్టారు’ అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లె నియోజకవర్గానికి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్త సాంబశివరావు వాపోయారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారంటూ రెండు నెలల కిందట సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

అది భావప్రకటన స్వేచ్ఛట.. ఇది చట్ట ఉల్లంఘనట

వైకాపా అధికారం చేపట్టాక ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు, రాళ్లు చెప్పులు విసిరారు. దానిపై అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందిస్తూ ‘నిరసన తెలపటం భావప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగం ఆ హక్కు ప్రతి ఒక్కరికీ కల్పించింది’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, పరిపాలనలో వైఫల్యాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినా చట్ట ఉల్లంఘన, నేరం అంటూ కేసులు పెడుతున్నారు.

* వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తల్లో భరోసా నింపేందుకు పల్నాడులోని ఆత్మకూరుకు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబును ఇంటి నుంచే బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ పర్యటనకు వెళ్తే విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా నోటీసులిచ్చారు. ఈ వ్యవహారంలో అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 151 ఏం చెబుతుందనేది న్యాయస్థానంలోనే ఆయనతో చదివించింది. అయినా సరే వైకాపాకు కొమ్ముకాసే విషయంలో పోలీసుల తీరు మారలేదు.

* చంద్రబాబు నివాసంపైకి ప్రస్తుత మంత్రి, అప్పటి వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ భారీ కాన్వాయ్‌తో దూసుకెళ్లినా పోలీసులు అడ్డుకోలేదు.

* డీజీపీ కార్యాలయం పక్కనున్న తెదేపా జాతీయ కార్యాలయంపై వైకాపా ఆధ్వర్యంలో కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసినా పోలీసులు పట్టించుకోనేలేదు.

* తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీకాకుళం జిల్లా పలాస వెళుతుండగా.. దారిలోనే అదుపులోకి తీసుకుని విశాఖపట్నానికి తిప్పి పంపారు.

అడుగు ముందుకేస్తే కాల్చిపారేస్తా

‘అసలు ఇక్కడికి రావటానికి నువ్వెవరు? అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తా’ అని శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథిపై రామగిరి సీఐ చిన్నగౌస్‌.. జులుం ప్రదర్శించారు. కుప్పంలో తెదేపా కార్యకర్తలు, నాయకులపై వైకాపా శ్రేణుల దాడికి నిరసనగా చెన్నేకొత్తపల్లి మండలంలో ఆందోళన చేపట్టేందుకు వెళ్తుండగా ఇలా హెచ్చరించారు.

నిరసనకు కూర్చో.. నీ కథ చూస్తా

POLICE
POLICE

‘అనంతపురంలోనే ఎవరూ నిరసన చేయలేదు. నువ్వెంత మగాడివి రా? నిరసనకు కూర్చో.. నీ కథ చూస్తా’ అంటూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు పరశురాంను అనంతపురం గ్రామీణ సీఐ విజయ భాస్కర్‌ గౌడ్‌ హెచ్చరించారు. కుప్పంలో వైకాపా శ్రేణులు దాడికి నిరసనగా అనంతపురంలో ఆందోళన చేస్తుండగా పోలీసులు ఇలా బెదిరించారు.

తొడగొట్టి.. మీసం మెలేసి

POLICE
POLICE

తొడగొట్టి.. మీసం మెలేసి.. ‘రండి తేల్చుకుందాం’ అంటూ కదిరి అర్బన్‌ సీఐ మధు తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయారు. లాఠీఛార్జి చేసి ఇష్టానుసారం వ్యవహరించారు. కదిరిలో ఓ ప్రైవేటు స్థలానికి సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. జోక్యం చేసుకున్న సీఐ ఇలా చెలరేగిపోయారు.

ప్రజాసంఘాలు, సామాన్యులపైనా దాష్టీకాలే

హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలపైనా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసన కార్యక్రమాలకు అనుమతే ఇవ్వట్లేదు. వాటిలో ఎవరూ పాల్గొనకుండా నోటీసులు, గృహనిర్బంధాలు, హెచ్చరికలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ తాజాగా ఉద్యోగులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్నీ ఇలాగే నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెడతామని భయపెడుతున్నారు.

ఇవి చదవండి: ఫ్లెక్సీల నిషేదంపై స్పందించిన పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.