కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. సింటా ఆధ్వర్యంలో రేపు దేశవ్యాప్తంగా రవాణా బంద్‌కు సరకు రవాణా వాహన యజమాన్య సంఘాలు పిలుపునిచ్చాయి. సింటా ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని లారీ యజమానుల సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రంలోనూ రేపు సంపూర్ణ బంద్ పాటించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.
పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. వే బిల్ సమయం పెంచాలని, ప్రతి సంవత్సరం టోల్ రేట్ల పెంపుదలను నిలిపివేయాలన్నారు. కాలం చెల్లిన టోల్ ప్లాజాలను తొలగించాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించాలని కోరారు. స్క్రాప్ పాలసీ సవరణ చేయాలనీ, గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయం విరమించుకోవాలని ఏపీ లారీ యజమానుల సంఘం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్‌తో 'పెట్రో బాదుడు'పై మమత నిరసన