రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 66 వేల 126 మంది వార్డు వాలంటీర్లు... కృషి చేస్తున్నట్లు పురపాలక శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. వైరస్‌ను నిరోధించేందుకు ఏం చేయాలన్న అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించిన జాగ్రత్తలపై... ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని.. వాలంటీర్లను ఆదేశించారు. నివాస ప్రాంతాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు సహా మార్కెట్లు, రైతు బజార్లు, బహిరంగ శౌచాలయాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో... పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
406 సత్వర స్పందన బృందాలు
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్న ప్రాంతంలో శానిటేషన్ పనులు చేస్తున్న వారికి శిక్షణనిచ్చేందుకు.. 1,315 బృందాలు ఏర్పాటు చేసినట్లు... విజయ్‌కుమార్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా గుర్తించి పూర్తి క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 406 సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేందుకు... పట్టణ స్థానిక సంస్థ నోడల్ అధికారిగా ఒక సీనియర్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఆరోగ్యశాఖ, జిల్లా అధికారులు, నోడల్ అధికారుల మధ్య సమన్యయకర్తగానూ పట్టణ స్థానిక సంస్థ నోడల్ అధికారి వ్యవహరిస్తారు. 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నెంబరుతో సహా, అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల స్వీకరణతో పాటు.. సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నెంబర్ 1800-5992-4365కు ఫోన్ చేయాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో క్వారంటైన్ కేంద్రాలు
ఐసొలేషన్‌లో ఉన్న కుటుంబంలో వ్యాధి ఇంకా వ్యాపించకుండా, వారికి అవసరమైన గృహోపకరణాలు అందజేయాలని ఆదేశించినట్లు... విజయ్‌కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన 298 భవనాల్లో... 4 వేల 292 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: