ప్రకాశం బ్యారేజి దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్షించారు. బ్యారేజి దిగువ ప్రాంతాలైన కృష్ణలంక, భూపేష్ నగర్ కాలనీ, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. వరద పెరిగితే ఈ ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుతం బ్యారేజి నుంచి 1,39,927 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఎగువ నుంచి 1,29,114 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని తెలిపారు. అటు మున్నేరు నుంచి మరో 90 క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. వర్షం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
ఇదీ చూడండి..