ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు అందింది. కాసేపట్లో పీఆర్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీని 25 శాతం లేదా 26 శాతం మేర ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈ పిలుపు వచ్చినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్ధిక శాఖ అధికారులతో పీఆర్సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
సానుకూల ప్రకటన చేస్తారు - సజ్జల
"పీఆర్సీపై సీఎం సానుకూలంగా ప్రకటన చేస్తారని భావిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను నిన్న ఉద్యోగ సంఘాలకు సీఎం వివరించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని భావిస్తున్నాం. అన్ని వర్గాలను కలుపుకొని పోయేలా నిర్ణయం ఉంటుంది. పీఆర్సీపై కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
ఇదీ చదవండి
Vanama Raghavendra Rao: ఎమ్మెల్యే తనయుడు.. వివాదాల రాఘవుడు.. అతడో కాలకేయుడు..