ETV Bharat / state

'రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల నిధులివ్వండి' - 15వ ఆర్థిక సంఘం

రాష్ట్ర అభివృద్ధికి రూ.9 లక్షల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు సమాచారం. ఈ మేరకు సవరించిన వినతిపత్రంతో కూడిన లేఖను 15వ ఆర్థిక సంఘానికి పంపినట్లు భోగట్టా.

ap government request finance commission
15వ ఆర్థిక సంఘం
author img

By

Published : Aug 14, 2020, 6:05 AM IST

ఆంధ్రప్రదేశ్ రాబోయే అయిదేళ్ల కాలానికిగానూ రూ. 9 లక్షల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు సమాచారం. రాష్ట్రానికి భారీగా నిధులివ్వడం, అదనపు కేటాయింపులు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను కూడా ప్రకటించాలని విన్నవించినట్లు తెలిసింది. ఈ మేరకు సవరించిన వినతిపత్రంతో కూడిన లేఖను 15వ ఆర్థిక సంఘానికి పంపినట్లు భోగట్టా.

విశ్వసనీయ సమాచారం మేరకు.. రాజధాని నగర నిర్మాణం, అభివృద్ధికి భారీగా నిధులివ్వాలని లేఖలో ప్రస్తావించింది. అయితే రాజధాని ఎక్కడన్నా విషయాన్ని పొందుపరచలేదు. రాజ్​భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ భవన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందంటూ విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని లేఖలో ప్రస్తావించింది. విశాఖపట్నం నగర అభివృద్ధికి రూ.4 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ నిధులతో రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, అవసరమైన భవన నిర్మాణం వంటివి చేపట్టనున్నట్లు పేర్కొంది. రాష్ట్రం కోరుతున్న కేటాయింపులకు సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి గత ప్రభుత్వ హయాంలోనే లేఖ రాశారు. ఈ సంఘం ఇంకా తుది నివేదిక సమర్పించలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రాధాన్యాలు మారాయని, కోవిడ్ పరిస్థితులు కూడా ఉన్నందున తదునుగుణంగా నిధులు కేటాయించాలని కోరుతూ తాజాగా సవరించిన వినతిపత్రాన్ని పంపించినట్లు సమాచారం. దానిలోని ప్రధానాంశాలివీ...

  • రాజధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లే ఇచ్చింది. న్యాయ వ్యవస్థ భవనాలకు రూ. 1,849 కోట్లు,శాసన వ్యవస్థ కోసం రూ. 1,397 కోట్లు, పరిపాలన వ్యవస్థ కోసం రూ. 5099 కోట్లు ఖర్చవుతాయి.
  • వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు , కొత్త జిల్లాల ఏర్పాటులో పాలనపరమైన అవసరాలకు, రాయలసీమ కరవు నివారణకు ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి.
  • ప్రాంతీయ అభివృద్ధి గ్రాంట్ కింద నిధులు ఇవ్వాలి.

ఇదీ చూడండి. 108 సిబ్బంది మానవత్వం.. కరోనా బాధితురాలికి ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.