రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్‌డీఆర్‌ఐ) విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. మొత్తం 55 మంది సిబ్బందింతో ఈ విభాగాన్ని ఏర్పాటుచేయనున్నారు. విభాగాధిపతిగా స్పెషల్ కమిషనర్ ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 15 రకాల యాక్టులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ పరిధిలోకి తీసుకొచ్చారు. పరిపాలనకు వీలుగా ఉండే ప్రాంతంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు.
ఏపీఎస్‌డీఆర్‌ఐ ప్రధానంగా జీఎస్‌టీతో పాటు ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, రవాణా, గనుల ఆదాయంలో లీకేజీ నివారణే లక్ష్యంగా పనిచేయనుంది. వివిధ రంగాల్లో పన్ను ఎగవేతదారులను గుర్తించడంతో పాటు ఎగవేసిన పన్నును రాబట్టేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్ కీలక నిర్ణయం- హెచ్-1బీ వీసాల నిలిపివేత