ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉద్యోగుల బదిలీల వివరాలతో జీఏడీ రాష్ట్ర పునర్విభజనశాఖ ప్రతిపాదన పంపగా... దానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

cm
cm
author img

By

Published : Sep 10, 2022, 1:58 PM IST

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉద్యోగుల బదిలీల వివరాలతో జీఏడీ రాష్ట్ర పునర్విభజనశాఖ ప్రతిపాదన పంపగా... దాన్ని సీఎం జగన్ ఆమోదించినట్లు.. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారని... తెలిపారు. వారి కోరికను మన్నించిన రెండు ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి.. బదిలీ కోరుతున్న ఉద్యోగుల వివరాలు సేకరించాయని వెల్లడించారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 13 వందల 38 మంది, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 18 వందల 4 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపుతామని వెంకటరామిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే.. అప్పుడు బదిలీలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి.. బదిలీల ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు.

ఇవి చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.