కృష్ణా జిల్లా విజయవాడలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల రిజర్వేషన్ తగ్గించటంపై నాయకులు మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గటం ప్రభుత్వ వైఫల్యమన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లపై స్పెషల్ లీవ్ పిటిషన్ ఎందుకు వేయట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఈ అంశంపై అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ...రిజర్వేషన్ 10 శాతం తగ్గటంతో స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపైల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్ని అన్ని పార్టీలతో చర్చించి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.'
ఇదీచూడండి. 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు