కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి అవంతి శ్రీనివాస్, కాకినాడ ఎంపీ వంగా గీతలు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు ఇరువురికి ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అందజేశారు.
ఇదీ చూడండీ... వరలక్ష్మీదేవిగా.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ