విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యురాలు చక్కా వెంకటనాగవరలక్ష్మి వాహనంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద తెలంగాణ మద్యం లభ్యమైన ఘటన మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఆమె కుమారుడితో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వివరాలను గురువారం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లండించారు.
మద్యం రవాణా చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు చక్కా సూర్యప్రకాశ్, జగ్గయ్యపేటకు చెందిన ఒస్తేపల్లి ప్రసన్న, కోదాడకు చెందిన నవీన్‌తో పాటు కారు డ్రైవర్ ఎస్.శివను నిందితులుగా గుర్తించినట్లు ఎస్‌ఈబీ ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు నైతిక బాధ్యత వహిస్తూ దుర్గగుడి దేవస్థానం పాలక మండలికి ఇప్పటికే చక్కా వెంకటనాగ వరలక్ష్మి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: