ETV Bharat / state

విజయవాడ డీజిల్ లోకోషెడ్ ఖాతాలో మరో ఘనత - Vijayawada latest news

అది ఓ రైళ్ల రిపేరీ కేంద్రం.! బండికి ఏ సమస్య వచ్చినా...సకాలంలో మరమ్మతులు చేయడంలో చేయి తిరిగిన నిపుణులున్న చోటది.! ఎన్నో ఆవిష్కరణలకు కేంద్రంగానూ పేరు గాంచింది. ఇలా చాలా ఘనతలున్న లోకోషెడ్.. మరో ఘనత ఖాతాలో వేసుకుంది. ఇంధన పొదుపులో...జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. ఇంతకీ ఆ లోకోషెడ్ ఎక్కడుంది..? అక్కడి ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం

విజయవాడ డీజిల్ లోకోషెడ్ ఖాతాలో మరో ఘనత
విజయవాడ డీజిల్ లోకోషెడ్ ఖాతాలో మరో ఘనత
author img

By

Published : Dec 31, 2020, 11:02 PM IST

ఇది విజయవాడ డీజిల్ లోకో షెడ్. బెజవాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో.... 40 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. డీజిల్‌తో నడిచే రైలింజన్లకు ఎలాంటి మరమ్మతు వచ్చినా.... ఇక్కడి నిపుణులు సకాలంలో తిరిగి పట్టాలెక్కిస్తారు. గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో వేల రైలింజన్లకు మరమ్మతులు చేసిన ఈ కేంద్రం... కొద్దిరోజుల కిందటే 2 రైలింజన్లను కలిపే సాంకేతికత రూపొందించి భళా అనిపించుకుంది. ఈసారి.... ఇంధనం పొదుపులో జాతీయస్థాయి అవార్డు సాధించి మరోసారి ప్రత్యేకత చాటుకుంది.

విజయవాడ డీజిల్ లోకోషెడ్ ఖాతాలో మరో ఘనత

లోకోషెడ్‌లో రైలు ఆగేందుకు భారీ షెడ్లు, మరమ్మతుల కేంద్రాలు, యంత్రాలు, క్రేన్లు ఉన్నాయి. లోకోషెడ్ ఏర్పాటైన నాటి నుంచి వీటన్నింటికీ సాధారణ విద్యుత్‌నే వినియోగిస్తున్నందు వల్ల... బిల్లులు నెలకు లక్షల్లో వచ్చేవి. ఇంధనం పొదుపు చేయాలన్న రైల్వేశాఖ ఆదేశాలతో... ఇక్కడి అధికారులు పొదుపు మార్గాలపై దృష్టి పెట్టారు. కార్యాలయంలో సాధారణ ఫిలమెంట్ లైట్లు, ట్యూబ్‌లైట్ల స్థానంలో... ఎల్​ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ఎవరూ లేనప్పుడు వాటంతటవే ఆగిపోయేలా బీఎల్​డీసీ ఫ్యాన్లకు సెన్సార్లు అమర్చారు. క్రేన్లు, భారీ యంత్రాలు, నీటి శుద్ధికేంద్రాల్లోని మోటార్లలో... ఇంధనం పొదుపు కోసం ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశారు.

విజయవాడ డీజిల్ లోకోషెడ్‌లో ఇంధనం ఆదా కోసం చేపట్టిన చర్యలను... ఇతర డివిజన్లలోని అధికారులు అడిగి తెలుకుంటున్నారు. ఇక్కడి నిపుణుల పనితీరును అభినందిస్తున్నారు.

ఇవీ చదవండి

కష్టాలను ఎదుర్కోనే మనోధైర్యాన్ని నింపిన 2020

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.