ETV Bharat / state

రాష్ట్రానికి చేరుకున్న మరో 1.32 లక్షల కొవిడ్ టీకా డోసులు - covishield vaccine

రాష్ట్ర అవసరాల దృష్ట్యా... 1.32 లక్షల కొవిడ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన కోవిషీల్డ్ టీకాలను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

Another 1.32 lakh Kovid vaccine doses have reached gannavaram
రాష్ట్రానికి చేరుకున్న కొవిడ్ టీకా డోసులు
author img

By

Published : May 25, 2021, 1:44 AM IST

రాష్ట్రానికి మరో లక్షా 32 వేల డోసుల కొవిడ్‌ టీకాలు చేరుకున్నాయి. టీకా డోసులతో పాటు అత్యవసర వైద్య సామగ్రి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. 11 బాక్సుల్లో చేరిన టీకాలను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. హైరిస్క్‌ కలిగిన 45 ఏళ్లకు పైబడ్డవారికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న వేళ తాజాగా చేరుకున్న టీకాలతో మరికొంత ఉపశమనం లభించనుంది.

ఇదీచదవండి.

ఆనందయ్య మందు.. సీసీఆర్‌ఏఎస్‌ నివేదికే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.