Anganwadi Workers: కృష్ణాజిల్లా మచిలీపట్నం బుట్టాయిపేటలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఉల్లింగపాలెంలో అంగన్వాడీ టీచర్‌గా పని చేసే సౌజన్య మృతి చెందింది. అయితే ఆమె అద్దె ఇంట్లో ఉంటుంది. ఆమె మరణవార్త తెలుసుకున్న ఇంటి ఓనర్ మానవత్వం అనేది మరచి ఇంట్లో శవం ఉండకూడదని చెప్పడంతో చేసేదేమీ లేక శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే అయినవాళ్లు ఎవరూ దహన సంస్కారులు చేసేందుకు ముందుకు రాలేదు. కట్టుకున్న భర్త ఉన్నా కడచూపునకు రాలేదు. విషయం తెలుసుకున్న తోటి అంగన్వాడీ కార్యకర్తలు పాడే మోసి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇదీ జరిగింది...: ఉల్లింగపాలెంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌజన్య గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. కొద్దికాలం క్రితం భర్త వదిలేయటంతో తల్లి వద్ద ఉంటోంది. ఇటీవలే ఆమె తన కుమార్తెకు పెళ్లి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సౌజన్య బుధవారం మరణించారు. అద్దె ఇంట్లో శవం ఉంచకూడదని..యజమాని చెప్పటంతో ఆమె మృతదేహాన్ని కృష్ణవేణి ఐటీఐ కాలేజీ సమీపంలోని...శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. దహన సంస్కారాలు చేసేందుకు ఎవరు రాకపోవటంతో విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలంతా కలిసి...శ్మశాన వాటిక వద్దకు వెళ్లి మృతురాలికి దహన సంస్కారాలను నిర్వహించారు.
ఇవీ చదవండి: