రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయిలో జరిపే వేడుకల్ని విజయవాడలోనూ, జిల్లా స్థాయిలో జరిగే వేడుకలు ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సర్కారు సూచించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
మూడు రోజులు వేడుకలు
వరుసగా మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వేడుకలు జరుగనున్నాయి. మొదటి రోజు చేనేత, హస్తకళల ప్రదర్శన. రెండో రోజు కూచిపూడి నృత్యం, సురభి నాటకాలు, జానపద కళలు ప్రదర్శించనున్నారు. ముడో రోజు తెలుగు సంప్రదాయల ఆహర ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: