ETV Bharat / state

అనుబంధ పరిశ్రమలే ఆసరా! - mango farmers latest news

మామిడి పంట చేతికి వచ్చే సమయానికి కరోనా ఆంక్షలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతామనే భయం పట్టుకుంది. లాక్​డౌన్​, కర్ఫ్యూ వంటి నిబంధనలతో ఇప్పటికే దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కృష్ణాజిల్లాలో స్థానికంగా ఉన్న అనుబంధ పరిశ్రమలు రైతులకు ఆశను కలిగిస్తున్నాయి.

mangoes
అనుబంధ పరిశ్రమకు చేరిన మామిడికాయలు
author img

By

Published : May 15, 2021, 4:12 PM IST

ఇటు ప్రకృతి వైపరీత్యాలు, అటు కరోనా ఆంక్షల నడుమ నలుగుతున్న మామిడి రైతులకు అనుబంధ పరిశ్రమలు ఆసరాగా నిలుస్తున్నాయి. ఈదురుగాలులు, వర్షాలతో నష్టపోతామనే భయంతో కోసిన పంటను మార్కెట్‌కు తరలించినా, కొనేవారు ఉండటంలేదు. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్కెట్లు మూసివేశారు. ఉన్నచోట కొనుగోలు చేసిన పంటను ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న లాక్‌డౌన్‌ కారణంగా దిగుమతి చేసుకునే అవకాశం లేక, ఆశించిన ధర రాక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా కొనసాగుతున్న అనుబంధ పరిశ్రమలు అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. వీటిలో స్థిరంగా ఉన్న ధరలు వారికి అండగా నిలుస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో దిగుమతులు నిలిచిపోవటంతో జిల్లావ్యాప్తంగా ఎగుమతులపై ప్రభావం చూపింది. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన రూపంలో ప్రకృతి దోబూచులాడుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉన్న పంటను వచ్చిన ధరకు విక్రయించుకునేందుకు గల అవకాశాలను అన్నదాతలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు మండలాల్లో కొనసాగుతున్న మామిడి అనుబంధ పరిశ్రమలు విక్రయాలకు భరోసా కల్పిస్తున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ముక్కల కంపెనీల నుంచి ప్రతిరోజూ కొన్ని వేల టన్నుల మామిడి ముక్కలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

రారాజుకు చుక్కెదురు.. తోతాపురికి అందలం

మామిడిలో రారాజుగా పేరున్న బంగినపల్లికి ఆది నుంచీ అధిక ధర లభిస్తోంది. గతంలో సీజను ఆరంభంలో టన్నుకు రూ.లక్షకు పైగా చెల్లించి, ఈ రకం మామిడిని కొనుగోలుదారులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది సీజను ఆరంభంలో ఇది టన్నుకు రూ.80 వేలు పలగ్గా ఇటీవల కాలంలో రూ.35 వేల వరకు పలికింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోవటంతో ఈ రకం మామిడిని కొనేవారు లేక కర్షకులు దిగాలు చెందుతున్నారు. ఈక్రమంలో అనుబంధ పరిశ్రమలకు అండగా నిలిచే తోతాపురిని ఆదరిస్తుండటంతో విక్రయాలకు, ధరకు నష్టం లేని పరిస్థితి ఉంది. తొలిరోజుల్లో ఈ రకం మామిడికి టన్నుకు రూ.20 వేల వరకు ఎగుమతిదారులు చెల్లించినా, అనంతరం అనుబంధ పరిశ్రమల రాకతో టన్నుకు రూ.15 వేల వద్ద ధరలో స్థిరీకరణ ఏర్పడింది. తాజాగా ఎగుమతులు నిలిచినా, అనుబంధ పరిశ్రమల్లో వీటి కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని విస్సన్నపేట, నూజివీడు, ఆగిరిపల్లి, ఎ.కొండూరు, రెడ్డిగూడెం తదితర మండలాల్లో సుమారు 800 అనుబంధ పరిశ్రమలు కొనసాగుతున్నాయి.

కూలీల కొరతే సమస్య

తోతాపురి రకం మామిడి ఎంత ఉన్నా, కొనుగోలుకు పరిశ్రమలు ముందుకొస్తున్నా, కరోనా ఆంక్షల నేపథ్యంలో కూలీల కొరత కారణంగా గతం కంటే తక్కువగా పరిశ్రమలకు పంట చేరుతోంది. అనుబంధ పరిశ్రమలకు వచ్చే పంట తక్కువగా ఉండటంతో 50 శాతం మేర ఉత్పత్తి తగ్గింది. రోజుకు జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల టన్నుల ఉత్పత్తులు ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. - వడ్లమూడి రాధాకృష్ణ, అనుబంధ పరిశ్రమ యజమాని, విస్సన్నపేట

ఇదీ చదవండి: కడప జిల్లాలో ముగిసిన శనగల కొనుగోళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.