ETV Bharat / state

ఆమె తింటే పైసలొస్తున్నాయి... అదెలా అంటే!?

మనసుకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ... కొత్త రుచులను ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తుంటే ఎలా ఉంటుంది? బెజవాడకు చెందిన ఓ యువతి ఇదే పని చేస్తోంది. ఉద్యోగాన్ని సైతం వదిలేసి సరికొత్తగా జీవితాన్ని మలచుకుంది. అంతేకాక దీనినే ఆదాయవనరుగా మార్చుకుని వేలకు వేలు అర్జిస్తోంది.

సీమా
author img

By

Published : Jul 17, 2019, 9:46 AM IST

ఆహారం+ విహారం= సీమా జీవితం

బెజవాడకు చెందిన సీమా గుర్ నాని... చిన్నప్పటి నుంచి ఆహార ప్రియురాలు. కొత్తరకం వంటకం కనపడితే చాలు. రుచి చూడందే నిద్రపోయేది కాదు. ఆ అలవాటే ఇప్పుడు ఆమెకు గుర్తింపు లభించేలా చేస్తోంది. సీమా ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగిగా చేరింది. వృత్తి పరంగా బాగానే ఉన్నా.. తనకు ఇష్టమైన అలవాట్లను దూరం చేసుకోవాల్సి వచ్చేది. హోటల్కు వెళ్లి సరదాగా తినే సమయం ఉండేది కాదు. దీని వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనంతరం తనకు నచ్చిన పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తూ... కొత్త రుచులు ఆస్వాదించటం మొదలుపెట్టింది. అంతేకాకుండా పాండా రివ్యూజ్ పేరిట బ్లాగ్ ఏర్పాటు చేసి తన అనుభవాలను అందులో పంచుకునేది. ఆయా ప్రాంతాలకు ఎలా వెళ్లాలి... ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుంది వంటి వాటిని అందులో పొందుపరిచేవారు.

దేశ విదేశాల్లో పర్యటనలు
విజయవాడలోని హోటల్స్​ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టింది సీమా. నగరంలో అన్ని రెస్టారెంట్లు ,హోటళ్లలో ఆహార పదార్ధాలను రుచి చూసి.. రివ్యూలు రాసింది. దీనివల్ల బ్లాగ్ చూసే వారి సంఖ్యతోపాటు... కొన్ని రెస్టారెంట్లకు గిరాకీ పెరిగింది. కొంతమంది హోటల్ నిర్వాహకులు సీమాను తమ రెస్టారెంట్​కు ఆహ్వానించి... తమ వంటకాలను వడ్డించేవారు. అయితే సీమా ఎప్పుడూ ఓ వినియోగదారురాలిగానే హోటల్​లో తిని కచ్చితమైన వివరణను బ్లాగ్​లో పొందుపరచేది. ఇప్పటికే 300 పోస్టింగ్​లు బ్లాగ్​లో పెట్టింది. దేశంలో 40 ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లు, స్ట్రీట్ పుడ్​ల రుచిని ఆస్వాదించింది. దేశానికే పరిమితం కాకుండా విదేశాల్లోనూ విహరిస్తోంది. ఇటీవలే మలేషియా వెళ్లి అక్కడి అనుభవాలను బ్లాగ్​లో పొందుపరిచారు. తనకు ఇష్టమైన వంటకాలు రుచి చూస్తూ, నచ్చిన చోటుకు ప్రయాణం చేస్తూ సరదాగా గడిపేస్తుంది. సీమా రాసిన రివ్యూలకు మంచి క్రేజ్ లభించింది. దీని ద్వారా నెలకు 30 నుంచి 40 వేల రూపాయలు సంపాదిస్తోంది.

Intro:p_VZM_02_16_ATTN_IDISANGATI_HOSTALS_PROBLEMS_PKG_BYTES_AP10085 వసతి గృహ విద్యార్థుల బైట్స్

Body:వసతిగృహం విద్యార్థులు బైట్స్

Conclusion:హేమలత siva రామకృష్ణ కృష్ణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.