ETV Bharat / state

'Amul Dairy: ఏపీ పాల ఉత్పత్తిదారుల లాభాల కోసమే అమూల్​కు లీజు'

పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ డెయిరీ ఆస్తులను లీజు ప్రాతిపదికన అమూల్ సంస్థ ( Amul Dairy ) (గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఏ)కు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ( State Government) హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం వెనుక దురుద్దేశాలేమీ లేవని పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ( Poonam Mala Kondayya) పేర్కొన్నారు.

Amul Dairy: ఏపీ పాల ఉత్పత్తిదారుల లాభాల కోసమే అమూల్​కు లీజు

author img

By

Published : May 29, 2021, 6:09 AM IST

పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ డెయిరీ ( Ap Dairy ) ఆస్తులను లీజు ప్రాతిపదికనే అమూల్ సంస్థకు కట్టబెట్టేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీని వెనుక సర్కార్​కు ఎలాంటి దురుద్దేశాలేమీ లేవని పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య కౌంటర్లో వివరించారు.

మంత్రి వర్గ నిర్ణయాన్ని సవాలు చేసిన ఎంపీ..

రాష్ట్రంలోని డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదలాయింపు చేసే నిమిత్తం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

30 లక్షల మహిళా పాల ఉత్పత్తిదారులకు లాభం..

ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 30 లక్షల మహిళా పాల ఉత్పత్తిదారులకు ( Women Milk Producers ) ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయం వెనుక సామాజిక , సంక్షేమ కారణాలున్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అమూల్, దాని భాగస్వాములకే లబ్ధి కలుగుతుందని పిటిషనర్ చెప్పడం సత్యదూరమన్న ప్రభుత్వ న్యాయవాది, పాలు, పాల ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలు అమూల్, దాని వాటాదారులకు చేరదని వివరించారు. ఆ లాభాలను మహిళా డెయిరీ సహకార సంఘాల ( ఎండీఎస్ఎస్ ) Women Dairy Co operative Societies సభ్యులకు పంపిణీ చేయనున్నట్లు న్యాయస్థానానికి వివరించారు. ప్లాంటుల నిర్వహణ ఖర్చులు, జీతాల చెల్లింపులు, మార్కెటింగ్ ఖర్చులను మాత్రమే అమూల్ పొందగలుగుతుందన్నారు.

లాభాలన్నీ వారికే..

వ్యాపారం ద్వారా వచ్చే లాభాలన్నీ 30 లక్షల మహిళా పాల ఉత్పత్తిదారులకు చెందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమూల్​లో ఒప్పందం ( Amul Agreement ) తర్వాత 760 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించామన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారులు గతంలో పొందినదానికంటే లీటరుకు రూ.4 నుంచి 14 వరకు ప్రయోజనం పొందినట్లు స్పష్టం చేశారు.

మంచి ధర దక్కేలా నిర్ణయం..

మహిళా డెయిరీ సహకార సంఘా పురోగాభివృద్ధి కోసం రాష్ట్రంలో 9,899 పాల ఉత్పత్తి చేసే గ్రామాలను గుర్తించామన్నారు. డెయిరీ వ్యవస్థకు పునర్జీవం తెచ్చేందుకు, పాలకు మంచి ధర దక్కేలా చూసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అమూల్ సంస్థ రాష్ట్ర స్థాయి సహకార సొసైటీకి 36 లక్షల మంది సభ్యులున్నారని.. దేశంలోనే ఏకైక పెద్ద సహకార సంస్థ అని పేర్కొన్నారు. సుమారు 40 దేశాల్లో విస్త్రృతమైన మార్కెటింగ్ నైట్​వర్క్ కలిగి.. ఏపీలో రోజుకు 35 వేల లీటర్ల పాలను అమూల్ సంస్థ సేకరిస్తోందని కోర్టుకు విన్నవించారు.

అదనపు ప్రయోజనం..

2020 నవంబర్ 20 నుంచి 2021 ఏప్రిల్ 10 వరకు పాల రైతులు లీటరుకు రూ. 4 నుంచి 14 వరకు అదనపు ప్రయోజనం పొందారన్నారు. ప్రైవేట్ డెయిరీలు చెల్లించినదాని కంటే మహిళా డెయిరీ రైతులు 21.56 కోట్లు అదనంగా పొందగలిగారని కౌంటర్లో వివరించారు.

అందుకే లీజు..

రాష్ట్రంలోని జిల్లాల్లో డెయిరీ ఆస్తులు నిరర్థకంగా ఉన్న నేపథ్యంలో సేకరించిన పాలను ప్రక్రియ చేసేందుకు ఏపీలో అమూల్​కు మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో పాల ప్రాసెస్ చేపట్టేందుకు నిరుపయోగంగా ఉన్న ఆస్తులను లీజుకివ్వాలని అమూల్ కోరిన నేపథ్యంలో గతేడాది జూలైలో ప్రభుత్వానికి అమూల్ మధ్య ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు.

పిటిషనర్​పై కేసులున్నాయి..

సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకున్నాక పిటిషనర్ పిల్ దాఖలు చేశారని.. ఈ వ్యవహారం సందేహాలకు తావిస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. ఈ పిటీషన్ .. ప్రైవేట్ ప్రయోజన వ్యాజ్య స్వభావం కనిపిస్తోందని.. రెండు బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూ.1064 కోట్ల విషయంలో పిటిషనర్​పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసిందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టారనే అభియోగాలతో మరికొన్ని కేసులు నమోదు కాగా ఆ విషయాల్ని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొనలేదని న్యాయస్థానానికి వెల్లడించారు. వాస్తవాలు వెల్లడించకపోవడం పిల్ నిబంధనలకు విరుద్ధం కనుక ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.

ఇవీ చూడండి : CM Jagan review: రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.