ETV Bharat / state

సరిపడా అంబులెన్సులు.. అయినా సకాలంలో అందని సేవలు! - ఏపీలో అంబులెన్సులు సేవలు

కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో పలుచోట్ల విపరీత జాప్యం నెలకొంటోంది. శాఖల మధ్య సమన్వయ లోపం, సమాచార వినిమయంలో ఇబ్బందుల వల్ల అంబులెన్సులు సకాలంలో బాధితుల వద్దకు చేరడం లేదు. ఫలితంగా బాధితులు గంటలు, రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

ambulances in andhrapradesh
ambulances in andhrapradesh
author img

By

Published : Jul 20, 2020, 7:50 AM IST

రాష్ట్రంలో సరిపడా అంబులెన్సులున్నా సకాలంలో బాధితుల వద్దకు చేరలేకపోతున్నాయి. ఫలితంగా రోగులు సొంత వాహనాల్లోనో, ఇతరుల సాయంతోనే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. అంబులెన్సులు పాతవి, కొత్తవి కలిపి ప్రతి మండలానికి ఒక అంబులెన్సును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1నుంచి సమకూర్చింది. బాధితులకు మెరుగైన అంబులెన్సు సేవలనందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న ఈ తరుణంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బాధితులను సత్వరం ఆసుపత్రులకు తరలిస్తే ముప్పు శాతం తగ్గనుంది.

సమన్వయ లోపం ఇలా..
ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. వైద్య ఆరోగ్య శాఖ ఈ సమాచారాన్ని సంబంధిత జిల్లా వైద్యాధికారి, స్థానిక సంస్థ, పోలీసు అధికారులకు తెలియజేస్తుంది. ఈ శాఖలు సమన్వయంతో వ్యవహరించి బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి. ఈ ప్రక్రియలో కొన్ని చోట్ల ఏర్పడుతున్న జాప్యం బాధితులు, వారి కుటుంబీకుల్లో ఆందోళనను పెంచుతోంది. అప్పటికే మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలుండి కరోనా బారినపడ్డవారు క్షణమో యుగంలా గడుపుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలున్న వారి పరిస్థితి వర్ణనాతీతం. కరోనా బాధితుడితో కలిసి చిన్నచిన్న ఇళ్లలో నివసించే వారు భయంభయంగా గడుపుతున్నారు.

  • అంతటా ఇవే సమస్యలు
    గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒకరికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇంటి నుంచి బయటకు రావొద్దని, అంబులెన్సు వచ్చి ఆసుపత్రికి తీసుకెళుతుందని సిబ్బంది చెప్పారు. అంబులెన్సు కోసం రోజంతా నిరీక్షించినా నిష్ఫలమే అయింది. శనివారం సాయంత్రం ఐదింటికి వచ్చిన వాహనం ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేర్చింది.
  • చిత్తూరు జిల్లా పెనుమూరువాసి ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని మంగళవారం రాత్రి అధికారులు ఫోన్‌ చేసి చెప్పారు. బుధవారం మధ్యాహ్నం అంబులెన్సు వచ్చేవరకు బాధితుడు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
  • ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒకరికి శుక్రవారం పాజిటివ్‌గా తేలింది. అంబులెన్సులో ఒకేసారి ఆరుగురిని తీసుకెళ్లడాన్ని గమనించి బాధితుడు సొంత వాహనంలో ఒంగోలుకు వెళ్లి ఆసుపత్రిలో చేరారు.
  • నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వ్యక్తికి ఈనెల 14న వ్యాధి నిర్ధరణ అయింది. మరుసటి రోజు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

బాధితులూ సహకరించాలి
కొన్ని చోట్ల బాధితులే సహకరించడం లేదు. పాజిటివ్‌ అని తేలినవెంటనే తామే ఆసుపత్రికి వస్తామంటూ కొందరు ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. తమ ఇంటి వద్దకు అంబులెన్సు రావడానికి మరికొందరు ఇష్టపడటం లేదు. ఇరుగుపొరుగు నుంచి ఒత్తిళ్లు వస్తాయని భయపడుతున్నారు.

కలెక్టర్ల పర్యవేక్షణలో..
ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆదేశాల మేరకు 15 నుంచి 25 అంబులెన్సుల్లో బాధితులను తరలిస్తున్నాం. కేసులు పెరుగుతున్నందున పాత 108 వాహనాల్లో వంద వరకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలనిచ్చింది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు - వైద్య ఆరోగ్య శాఖ

విజయవాడ భవానీపురానికి చెందిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణయిందని, అంబులెన్సు పంపుతామని వైద్య సిబ్బంది చెప్పారు. అదే రోజు రాత్రి ఓ కానిస్టేబుల్‌ ఇంటికి వచ్చి బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను తెలుసుకున్నారు. కలెక్టరేట్‌ నుంచీ ఫోన్‌ చేసి వివరాలను సేకరించారు. 3 రోజులైనా అంబులెన్సు రాలేదు. జ్వరం తీవ్రంగా ఉండడం, శ్వాస ఇబ్బంది కావటంతో బాధితుడి అన్న కుమారుడు ద్విచక్రవాహనంపై ఈనెల 11న రాత్రి రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి

తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య తీరంలో చీలిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.