ETV Bharat / state

కడప ఉక్కు పరిశ్రమకు రూ.500 కోట్లు: సీఎం జగన్ ఆదేశాలు - కడప స్టీల్ ప్లాంట్లుకు నిధులు వార్తలు

కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం దిశగా మరో అడుగు పడింది. దీనికి ఈక్విటీ కింద 500 కోట్ల రూపాయలను కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలాగే పరిశ్రమ నిర్మాణం కోసం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని చెప్పారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 15, 2020, 6:33 PM IST

కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఈక్విటీ కింద 500 కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పరిశ్రమ నిర్మాణం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

కడప ఉక్కు పరిశ్రమ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను... ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. వాటితో చర్చలు కొనసాగించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

రెండు సంవత్సరాల్లోగా టౌన్‌షిప్, అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, ప్రహరీ గోడ, విద్యుత్‌ సరఫరా కోసం నిర్మాణపు పనులు సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

సభలో సమరం: నల్ల చొక్కాలతో హాజరవ్వాలని తెదేపా నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.