విజయవాడలో కేంద్ర బడ్జెట్... ప్రజలపై భారాలు, రాష్ట్రానికి అన్యాయం అంశంపై అఖిలపక్ష పార్టీలు సదస్సు నిర్వహించారు. బడ్జెట్లో రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఊసే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైకాపా ఎంపీలకు పార్లమెంట్ సమావేశాలప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందని, విభజన హామీలు సాధించడంలో మన ఎంపీలు ఘోరంగా విఫలమైయ్యారని ఆరోపించారు. 25 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి హోదా తెస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు రాబట్టేవరకు పోరాడుతామన్నారు.
ప్రత్యేకహోదా, అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే ఎంపీలు ఎందుకు అడగలేకపోతున్నారని ఆంధ్ర మేధావుల ఫోరమ్ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజధాని రైతులు గురించి వారు వేసుకునే బట్టలు గురించి మాట్లాడే నీచ సంస్కృతి ఉన్న వారు రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యమన్నారు.విశాఖ ఉక్కు జోలికి వస్తే మోదీ, అమిత్ షాల పతనం ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవుతుందన్నారు.
ఇదీ చదవండి