నివాసయోగ్యమైన స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో అఖిలపక్ష నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన భూములు శ్మశానానికి దగ్గరలోనూ... ముంపు ప్రాంతాల్లోనూ ఉన్నాయని వారు ఆరోపించారు.
నివాసానికి అనువైన ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారుల మీదే ఉంటుందని... లబ్ధిదారుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తహసీల్దార్‌కు నేతలు సూచించారు.
ఇదీ చదవండి: