ఆస్తి విలువ ఆధారిత , చెత్త , డ్రైనేజీపై పన్నుల జీవోలను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్లు నిరసన దీక్ష చేపట్టారు. కరోనా ప్రభావంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి సమయంలో ప్రజలపై పన్నుల రూపంలో అదనపు భారాలను మోపడం ఎంతవరకు సమంజసమని అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం ఏకపక్షంగా పన్నుల జీవోలను ఆమోదించిందని మండిపడ్డారు. తక్షణమే పనుల జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను జీవోలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Devineni: దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా