ETV Bharat / state

విజయవాడ: మున్సిపల్ ప్రచారంలో నేతలు.. ఏర్పాట్లలో అధికారులు

నగర పోరు జోరందుకుంది. ఎల్లుండితో ప్రచార గడువు ముగుస్తోంది. పట్టణ ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటా పోటీ హామీలతో దూసుకుపోతున్నాయి. అసమ్మతి, బుజ్జగింపులు, ప్రత్యర్థుల లొంగదీతలు ఇదే స్థాయిలో ఊపందుకున్నాయి. విజయవాడ మేయర్ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు తెదేపా, తొలిసారి పాగా వేసేందుకు వైకాపా పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి.

author img

By

Published : Mar 6, 2021, 10:12 AM IST

all parties campaign at vijayawada
జోరందుకున్న నగర ప్రచార పోరు
జోరందుకున్న నగర ప్రచార పోరు

విజయవాడలో నగర పాలక సంస్థ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.

మేమే గెలుస్తాం..!

తూర్పు నియోజకవర్గం వివిధ డివిజన్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్​తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 39, 48, 53వ డివిజనులో అభ్యర్థుల గెలుపున‌కు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 26వ డివిజన్​లో అంగిరేకుల గొల్లభామ గెలుపుని కాంక్షిస్తూ మంత్రి కొడాలినాని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం చేశారు.

గెలిస్తే.. వైకాపా పన్నులు పెంచడం ఖాయం!

తెదేపా మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేత 11వ డివిజన్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే.. వైకాపా పన్నులు పెంచుతుందని చెప్పారు. తెదేపానే గెలిపించాలని కోరారు.

పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి మేమే చేశాం..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ లో తెదేపా బలపరిచిన సీపీఎం అభ్యర్థి దోనేపూడి శంకర్ విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రచారం నిర్వహించారు. 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని తాము అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధిపరిచామని అన్నారు. పశ్చిమనియోజకవర్గం అభివృద్ధి చేసింది తెదేపానే అని ఈ విషయంపై మంత్రి ఇంటి ముందు చర్చకు తాను సిద్దమని సవాల్ విసిరారు.

ప్రజా చైతన్య యాత్ర

61వ డివిజన్​లో తెదేపా అభ్యర్థిని దాసరి ఉదయశ్రీ తరఫున పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.

'ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారు'

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఠాగూర్ పద్మావతి విజయాన్ని కాంక్షిస్తూ జన సేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.

మీతోనే ఉంటా..!

39వ డివిజన్​లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బోండా నిరిష్ కుమార్ వినూత్నంగా కమలం గుర్తుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీని విజయవాడ నగరంలో గెలిపిస్తే నిత్యం తాను అక్కడే ఉంటానని ..సమస్యలను తీరుస్తానని అన్నారు.

వైకాపా పాలనపై వ్యతిరేకతే ఎజెండా

మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మొదటిసారిగా కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని .. ప్రజలు తమకే ఓటు వేస్తారని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. 20 నెలల వైకాపా పాలనపై వ్యతిరేకతే తమ ఎజెండా అని తెలిపారు.

గెెలిపిస్తే ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా

యువతకు ఉద్యోగాల కల్పనలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. పురపాలక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే ప్రతి ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత 21 నెలల్లో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోగా ఒక్క ఉద్యోగ కల్పన జరగలేదని మండిపడ్డారు.

గట్టి బందోబస్తు

మున్సిపల్ ఎన్నికలకు గట్టి బందోబస్తు చేశామని పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో మద్యం రవాణా, నగదు పంపిణీలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లను బైండోవర్ చేశామని.. లైసెన్స్ ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పెడనలోని సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ తనిఖీ చేశారు.

తగిన ఏర్పాట్లు చేశాం..!

ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. నూజివీడు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతమైన ఆర్ఆర్​పేట, ఎమ్మార్ అప్పారావు, నెట్వర్క్ పేటలోని ఎన్నికల కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇదీ చూడండి:

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.