వైయస్సార్ ట్రేడ్ యూనియన్ తప్ప మిగతా ఏ ఉద్యోగ సంఘాలు ఉండడానికి వీల్లేదని హుకూం జారీ చేసిన కృష్ణా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకటరావు తీరును అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బియస్ రాంబాబు తీవ్రంగా ఖండించారు. బ్యాంకింగ్ రంగంపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి వెంకటరావు అని, ఆయన చర్యలతో బ్యాంకు కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉండగా తనకు అనుకూలంగా లేరని, 200 మంది ఉద్యోగులను అక్రమంగా బదిలీ చేశారన్నారు. ఉద్యోగులను బదిలీ చేసే హక్కు చైర్మన్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బదిలీలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇలాంటి చర్యలను ఇప్పుడు అడ్డుకోకపోతే మిగతా జిల్లాల్లో కూడా ఇదే తరహాలో వైకాపా నాయకులు వ్యవహారిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా గెలిచినంత మాత్రాన ఆ సంఘం తప్ప వేరే సంఘం ఉండడానికి వీల్లేదనడం వారి కృరత్వానికి ప్రతీకని మండిపడ్డారు.
ఇవీ చూడండి...