విశాఖ, విజయవాడకు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటుకు ప్రతిపాదించిన జగన్ సర్కారు... కర్నూలును ఏ విధంగా న్యాయ రాజధానిగా చెబుతుందని తెదేపా నేత అఖిలప్రియ దుయ్యబట్టారు. 3 రాజధానుల నిర్ణయంతో రాయలసీమ ప్రజలే ఎక్కువగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్డుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వైకాపా నేతలు ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు.
దీనిపై కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అందరం పోరాడాలని అఖిలప్రియ పిలుపునిచ్చారు. రాయలసీమను కాపాడుకునేందుకు అంతా కలసి రావాలన్నారు. ప్రభుత్వం రాయలసీమలో ప్రాజెక్టులన్నీ ఆపేయటంతో పాటు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకుండా తీరని ద్రోహం చేస్తోందని ఆమె ఆరోపించారు.
ఇదీ చదవండి..