ETV Bharat / state

'రాజధాని కోసం భూమి ఇవ్వని నీకు మాట్లాడే అర్హతే లేదు' - అంబటి రాంబాబు తాజా వార్తలు

రాజధాని కోసం అమరావతిలో ఉద్యమాలు చేస్తున్న రైతులపై ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఏఐసిసి సభ్యులు, విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు డిమాండ్‌ చేశారు. రాజధాని కోసం ఎకరం భూమి కూడా ఇవ్వని అంబటికి రైతుల త్యాగాల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు.

AICC PRECIDENT FIRE ON AMBATI RAMBABU ABOUT CAPITAL FARMERS

author img

By

Published : Aug 25, 2020, 5:55 PM IST

అమరావతి రాజధాని నిర్మాణం పెద్ద స్కామ్, అక్కడ ఉండే రైతులు ఎవరూ ఉద్యమం చేయటం లేదు, అసలు అక్కడ ఉద్యమమే లేదని, కొంతమంది ధనవంతులు చేస్తున్న ఆర్భాటమని ఆరోపించిన అంబటి రాంబాబు తక్షణకే రైతులకు క్షమాపణ చెప్పాలని ఏఐసిసి సభ్యులు, విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు డిమాండ్‌ చేశారు.

రాజధాని కోసం 85 మంది రైతులు చనిపోతే అది వారికి కట్టుకథలాగా కనిపిస్తుందా అని విమర్శించారు. రైతు శ్రామిక పార్టీ పేరు పెట్టుకున్న వైకాపా రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. వైకాపా ప్రజల కోసం పని చేయాలే గానీ ముఖ్యమంత్రి మెప్పు కోసం కాదని హితవు పలికారు.

అమరావతి కోసం ప్రాణాలర్పించిన రైతుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిందా.. రైతుల మరణాలు ఆపటానికి నివారణ చర్యలు చేపట్టిందా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన ఇంతమంది రైతులు, పేదలు, ఎస్సీలు వైకాపాకు అసలు మనుషులు లాగా కనపడటం లేదా అని మండిపడ్డారు.

అయినా రాజధానికి ఒక ఎకరం భూమి కూడా ఇవ్వని అంబటికి త్యాగాల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వారి బిడ్డల భవిష్యత్తు కాలరాస్తున్న వైకాపాకు పతనం తప్పదని నరహరశెట్టి నరసింహారావు తెలిపారు.

ఇదీ చూడండి

నూతన పారిశ్రామిక విధానం సరిగా లేదు: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.