ETV Bharat / state

అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం - బైక్​ను ఢీకొట్టిన అడిషనల్ డీజీపీ కారు

అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణం శివారులో డీజీపీ కారు బైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి.

Additional DGP Kripanand Tripathi Ujela escaped a major accident
అడిషనల్ డీజీపీకి తప్పిన ప్రమాదం
author img

By

Published : Dec 7, 2020, 11:29 AM IST

కృష్ణా జిల్లా నందిగామ జాతీయ రహదారిపై అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో డీజీపీ కారు బైక్​ను ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు కావటంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు కంచికచర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహారావుగా గుర్తించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు రహదారి పక్కన గుంతలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అదనపు డీజీపీ సురక్షితం బయటపడ్డారు. వెంటనే మరో కారులో ఆయనను సెక్యూరిటీ సిబ్బంది తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తుళ్లూరులో ఉద్రిక్తత.. డీజీపీ వస్తేనే ఆందోళన విరమిస్తామన్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.