ETV Bharat / state

వివాహేతర సంబంధంలో మనస్పర్థలు... యాసిడ్​తో మహిళపై దాడి - Krishna district latest news

మహిళపై యాసిడ్​తో వ్యక్తి దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. గణపవరానికి చెందిన మహిళ... గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు రావటంతో ఆ వ్యక్తి యాసిడ్​తో దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Acid attack on a woman
యాసిడ్​తో మహిళపై దాడి
author img

By

Published : Jun 13, 2021, 12:32 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపవరంలో మహిళపై ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. గ్రామానికి చెందిన కట్టా వెంకాయమ్మకు భర్త లేడు. ఆమె.. పటాపంచుల గోపితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ సమయంలో ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

తనతో మాట్లాడటం లేదని వెంకాయమ్మపై గోపి ఆగ్రహంతో యాసిడ్‌తో దాడి చేశాడు. ఘటనలో ఆమె శరీరం తీవ్రంగా కాలిపోయింది. వెంటనే స్థానికులు మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గోపిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

కి'లేడీ': ముచ్చటగా మూడో పెళ్లి.. రూ. 6 లక్షలతో ఉడాయింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.