రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు సుబ్బారావుపై హత్యాయత్నం సీఎం జగన్ అరాచక పాలనకు నిదర్శనం అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని నిలదీశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే సుబ్బారావుపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీస్తున్నారనే కక్షతోనే కుండబద్దలు సుబ్బారావుపై అనైతిక చర్యలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు అన్నారు. తాను ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టిందని సుబ్బారావు స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని... ఘటనపై ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: