ETV Bharat / state

జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకర ప్రాంతాలు

విజయవాడ- హైదరాబాద్​ జాతీయరహదారి... ప్రయాణికులను హడలెత్తిస్తుంది. రోడ్డు నిర్మాణంలో తలెత్తిన లోపాలు వాహనదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ మార్గంలోని కొన్ని కూడళ్లలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

accident spot on national highway
హైవేపై అత్యంత ప్రమాదకర ప్రాంతం
author img

By

Published : Nov 2, 2020, 12:26 PM IST

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నాలుగు వరుసలుగా విస్తరించినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. హైవేతో అనుసంధానం అయ్యే నవాబుపేట కూడలి అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారింది. రోడ్డు నిర్మాణంలో అక్కడక్కడ తలెత్తిన లోపాలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారితో కలిసే గ్రామ కూడళ్లలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.

అధికారులు ఇప్పటికే పది ప్రమాదకర బ్లాక్ స్పాట్​లను గుర్తించారు. వాటిలో అత్యంత ప్రమాదకరమైనవి బలుసుపాడు, కొనకంచి, నవాబుపేట. వీటిలో నవాబుపేట, కొనకంచి కూడళ్లలో గడిచిన ఐదేళ్లలో 15 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అండర్ పాస్, సర్వీస్ రోడ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి హైవే ఎక్కుతున్న వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటువంటి ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్మగ్లర్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.