ఆధారాలు దొరకక మిస్టరీగా మారిన కేసులను ఛేదించిన పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఏబీసీడీ అవార్డ్లు అందజేశారు. ఈ సారి ప్రత్యేకంగా అట్రాసిటీ కేసులను ఛేదించి.. నిందితులకు శిక్ష పడేవిధంగా చేసిన పోలీసులకు ఈ అవార్డ్స్ లో స్థానం కల్పించారు.
ఏలూరులో సైనేడ్ తో హత్యచేసిన సీరియల్ కిల్లర్‌ను చాకచక్యంగా పట్టుకున్న ఘటనకు, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని గుర్తించి... నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులకు,కృష్ణాజిల్లా నూజివీడులో పదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసును ఛేధించిన పోలీసులకు బహుమతులు లభించాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తే మిస్టరీ కేసుల్లో నిందితులను గుర్తించవచ్చని డీజీపీ సవాంగ్ తెలిపారు.
ఇదీచదవండి.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా