ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన - ఆశా వర్కర్ల

"మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆరునెలలుగా పెండింగ్​లో ఉన్న బకాయిలు చెల్లించాలి. రాజకీయ వేధింపులు, అక్రమ తరలింపులు అరికట్టాలి. లేదంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం." ఆశా వర్కర్లు

రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన
author img

By

Published : Jul 15, 2019, 3:27 PM IST

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆరు నెలల నుంచి ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పారితోషికాలతో ముడిపెట్టకుండా పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకులు కొందరు తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ తరలింపులు, రాజకీయ వేధింపులను అరికట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ.. లేదంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Intro:Ap_cdp_47_15_spandana_prati samasya_pariskaram_Av_Ap10043
స్పందన కార్యక్రమంలో ప్రజలు అధికారుల దృష్టికి వచ్చాయి ప్రతి సమస్యను పరిష్కరిస్తారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో నాగన్న అధ్యక్షతన జరిగిన స్పందనలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయం.. ఇప్పుడు రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. స్పందనలో ఇచ్చే ప్రతి అర్జీకి రసీదు ఇవ్వడం జరుగుతుందని, సమస్యను బట్టి నిర్ణీత సమయంలో వాటిని అధికారులు పరిష్కరిస్తారని చెప్పారు. ఫిర్యాదులో అవాస్తవాలు ఉంటే వాటిని అర్జీదారులకు తెలియజేస్తారని తెలిపారు.

Body:రాజకీయాలకతీతంగా సమస్యల పరిష్కారం

Conclusion:ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.