కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువతీయువకుల ఆత్మహత్యలు ఆ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందిన కొలుసు నాగరాజు(27).. కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదే గ్రామానికి యువతి ధర్మవరపు నాగశివ(21) ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.
అయితే యువతికి ఇటీవలే కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. గ్రామంలో ఆ ఇద్దరి ఆత్మహత్యలపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన వీరవల్లి పోలీసులు.. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:
అత్తను చంపిన అల్లుడు... ఆస్తి తగాదానే కారణం!
దిల్లీ సరిహద్దులో అన్నదాతల గుడిసెలు