ETV Bharat / state

'జీతాలకు చట్టం చేయమంటే.. సంఘం గుర్తింపు రద్దు చేయమంటారా?' - ఒకటో తేదీన జీతాలు చెల్లించాలన్న జీవోలు

War Between Employee Union Leaders: ఉద్యోగుల సర్వీసులను నియంత్రించే అధికారం గవర్నరుకే ఉంది కాబట్టి.. గవర్నరును కలిశామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ స్పష్టం చేశారు. వేతనాల చెల్లింపు ఒకటో తేదీనే చేసే చట్టం ఉందన్న ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు.. దానిని నిరూపించాలని డిమాండ్ చేశారు. చట్టం ఇప్పటికే ఉండి ఉంటే తాము క్షమాపణ కోరతామని తెలిపారు. రాజకీయానికి తొలి మెట్టు అన్నట్టు.. ఏపీ ఎన్జీవో సంఘం మారిందని ఎద్దేవా చేశారు.

ap employees leaders
ఏపీ ఎన్జీఓ నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు
author img

By

Published : Jan 20, 2023, 7:41 PM IST

Updated : Jan 20, 2023, 9:07 PM IST

War Between Employee Union Leaders: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ఏపీ ఎన్జీఓ నేతలు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ స్పందించారు. ఉద్యోగుల సర్వీసులను నియంత్రించే అధికారం గవర్నరుకే ఉంది కాబట్టి.. ఆయనను కలిశామని స్పష్టం చేశారు. మేం వేరే సంఘం పేరు, వేరే సంఘ నేతల ప్రస్తావన కానీ చేయలేదని స్పష్టం చేశారు. వేతనాల చెల్లింపు ఒకటో తేదీనే చేసే చట్టం ఉందన్న ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దానిని నిరూపించాలని డిమాండ్ చేశారు. చట్టం ఇప్పటికే ఉండి ఉంటే తాము క్షమాపణ కోరతామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు

ఒకటో తేదీన జీతాలు చెల్లించాలన్న జీవోలు ఉన్నాయే తప్ప.. చట్టం లేదన్నారు. తాము రేపట్నుంచే సమ్మె చేయడానికి సిద్దంగా లేమని మా కార్యాచరణ ప్రకారం మేం వెళ్తామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్తామని తాము చెప్పలేదన్న సూర్యనారాయణ.. మా సంఘం గుర్తింపును రద్దు చేయమని ఫిర్యాదు చేసే హక్కు వారికి ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దొడ్డిదారిన గుర్తింపు తెచ్చుకోలేదని పేర్కొన్నారు. జీతాల విషయంలో చట్టం చేయమంటే.. సంఘం గుర్తింపు రద్దు చేయమంటారా అని ప్రశ్నించారు.

మా వెనుక లక్షలాది ఉద్యోగుల మనోభావాలున్నాయని వెల్లడించారు. గతంలో మా సంఘం గుర్తింపుపై ఫిర్యాదులు చేశారు.. కోర్టుకెళ్లారని గుర్తు చేాసారు. ఎన్జీవో సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు సరికాదంటూ స్వయంగా సీఎం జగన్ సంతకం చేసి.. మాకు గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. అడ్డూ అదుపు లేకుండా ఏపీ ఎన్జీవో సంఘం నడుస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మండిపడ్డారు. రాజకీయానికి తొలి మెట్టు అన్నట్టు ఏపీ ఎన్జీవో సంఘం మారిందని ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్జీవో సంఘంలో కేవలం నాన్ గెజిటెడ్ స్థాయి వాళ్లే ఉంటారన్నారు. మా సంఘంలో అటెండర్ నుంచి అధికారుల వరకు ఉన్నారని తెలిపారు.

తోటి సంఘ నేతను.. ఖబడ్దార్ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ ఖబడ్దార్.. ఆస్కార్ రావు కాస్కో.. దమ్ముంటే చూస్కో అంటారా అని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేస్తారా.. కుస్తీ పోటీలు పడతారా అని నిలదీశారు. ఏపీ ఎన్జీవో నుంచి సగం మంది ఉద్యోగులు మా సంఘంలో చేరారు. గవర్నర్ ఏమైనా దేశ ద్రోహా.., గవర్నర్ దగ్గరకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. రాజ్యాంగ అధినేతగా ఆయన్ను కలిసి ఉద్యోగుల ఇబ్బందులు నివేదించామన్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడాలి తప్ప కుస్తీ పోటీల్లో కాదని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 20, 2023, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.