ETV Bharat / state

నిరాశ్రయులకు, వలస కూలీలకు 3 పూటలా భోజనం - food distribution

కృష్ణా జిల్లా గన్నవరంలో జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు, నిరాశ్రయులకు బీకేఆర్ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అన్నదానం చేస్తున్నారు. జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు సహకరిస్తున్నట్టు వారు చెప్పారు.

krishna distrct
నిరాశ్రయులకు, వలస కూలీలకు మూడు పూటల భోజనం
author img

By

Published : May 18, 2020, 6:21 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారి వెంట నివసిస్తున్న నిరాశ్రయులకు, వలస కూలీలకు జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అండగా నిలిచారు. ఆయన సహకారంతో బీకెఆర్ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కానూరి శేషుమాధవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు.

పేదలకు నిత్యావసర సరకులు, వృద్దులకు పండ్లు, చిన్న పిల్లలకు పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఉన్నదానిలో పది మందికి పంచినంత సంతృప్తి మరెందులో లేదని కుమారస్వామి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ మద్యం తరలింపును అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.