విజయవాడలోని భవానిపురం సితార సెంటర్ వద్ద ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముండే పూర్ణారెడ్డి, విద్యాధరపురానికి చెందిన లారీ డ్రైవర్ ఈశ్వర రెడ్డికి గొడవ జరిగింది. ఈ క్రమంలో పూర్ణారెడ్డి పై ఈశ్వర రెడ్డి కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి మెడపై బలమైన గాయం అయ్యింది. స్థానికుల సాయంతో క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!